అప్పుడే లాభాల్లోకి రాయన్.. సాలిడ్ రెస్పాన్స్?

Purushottham Vinay

తమిళ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీ రాయన్ అనే టైటిల్ తో తమిళం, తెలుగు ఇంకా హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల అయ్యి సూపర్ హిట్ గా దూసుకుపోతుంది.ఈ మూవీలో దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి ఇంకా అలాగే SJ సూర్య కీలక పాత్రలలో నటించారు. సూపర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 5 రోజులలో ఏకంగా 105.38 కోట్లు వసూలు చేసింది.రాయన్ సినిమా తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 74 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, వర్కింగ్ డే లో సగం డ్రాప్ అయినా స్టడీ హోల్డ్ ని బాగానే కొనసాగిస్తోంది. విడుదలైన ఐదవ రోజు కూడా రాయన్ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 34 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇంకా అలాగే వరల్డ్ వైడ్ గా ఐదవ రోజు 6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. 


ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో ద్వారా సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది.ఇక ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పాలి.ఒకసారి ఈ సినిమా 5 డేస్ కలెక్షన్స్ ని కనుక గమనిస్తే..రాయన్ మూవీకి తెలుగులో రూ.2.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.6 కోట్ల దాకా షేర్ వసూళ్లను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ.4.32 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. ఇప్పటి దాకా రూ.1.72 కోట్ల ప్రాఫిట్స్ ను కూడా అందించడం విశేషం. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 46 కోట్ల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: