కృతి శెట్టి అందుకే అలా చేస్తుందా..?

shami
ఉప్పెన సినిమాతో మొదటి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వర్సూగా అరడజనుకి పైగా సినిమాలను ఆలోచించకుండా చేసింది. హిట్టు కొట్టిన హీరోయిన్ వెంట దర్శక నిర్మాతలు వెంట పడటం కామనే. అందుకే ఆ టైం లో కథలా గురించి పెద్దగా ఆలోచించకుండానే కృతి శెట్టి సినిమాలు చేసింది. ఐతే కృతి శెట్టి కి అసలు విషయం తర్వాత అర్ధమైంది. సినిమాలు చేశామన్న లెక్కే కానీ హిట్ రేషియో పడిపోయింది. అందుకే ఈమధ్య అమ్మడికి ఆఫర్లు తగ్గిపోయాయి.
ఐతే ఒక్క సారి కెరీర్ గ్రాఫ్ పడిపోతే దాన్ని లేపడం చాలా కష్టం. అందుకే కృతి శెట్టి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తొలి సినిమాతోనే బేబమ్మగా ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి ఈమధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఫోటో షూట్ లో ఇన్నాళ్లు మొత్తం కవర్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చిన కృతి శెట్టి ఈమధ్య స్కిన్ షోకి రెడీ అయిపోయింది.
స్లీవ్ లెస్ కట్స్ తో.. తొడలు కనిపించే ఫోటో షూట్స్ తో తనలో ఈ యాంగిల్ కూడా ఉందని ఊరిస్తుంది అమ్మడు. కృతి శెట్టి లాంటి క్యూట్ హీరోయిన్స్ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఈమధ్యనే శర్వానంద్ తో మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి ఇక మీదట ఆ సినిమా ఈ సినిమా అని కాదు ఏదైనా చేసేందుకు రెడీ అంటుంది. కృతి నుంచి ఈ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న మేకర్స్ ఆమెతో ఒక అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి కృతి ఫేట్ ఈ సినిమాతో అయినా మారుతుందా లేదా అన్నది చూడాలి. అమ్మడు తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: