వామ్మో: రెండో పెళ్లి పై.. నిహారిక ఏమందంటే..?

Divya
మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నిహారిక మొదట యాంకర్ గా మొదలుపెట్టి ఆ తర్వాత యాక్టర్ గా నిర్మాతగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నది. నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. అయితే నిహారిక పర్సనల్ లైఫ్ విషయంలో కూడా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత ఇమే సైలెంట్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ తన వర్క్ మీద ఫోకస్ పెట్టింది.తన నటనతో సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం. కమిటీ కుర్రాళ్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక బిజీగా ఉన్నది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మళ్లీ ప్రేమ పెళ్లి విషయం పైన స్పందించింది.. విడాకుల తర్వాత  జీవితం మెరుగ్గానే ఉందా అని యాంకర్ అడగగా.. అందుకు నిహారిక ప్రస్తుతం తాను వర్కు పైన ఎక్కువగా దృష్టి పెట్టానని తెలిపింది..

ఆ తర్వాత ప్రేమ పెళ్లి విషయం పైన అడగగా.. తాను ప్రస్తుతం హ్యాపీగా ఉండాలనుకుంటున్నానని అది సింగిల్ గానా లేకపోతే ఎవరితో కమిట్ అయ్యాక అనేది ఇంకా సమయమే నిర్ణయిస్తుంది అంటూ తెలియజేసింది.. తాను దేనికోసం కూడా పెద్దగా వెతకానని ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందంటూ తెలియజేసింది నిహారిక.. అయితే పేరెంట్స్ కూడా తనకు ఏ విధంగా గౌరవం ఇస్తారో అంతే స్వేచ్ఛ కూడా ఇచ్చారని.. తల్లిదండ్రులు తనపైన ఎలాంటి ప్రెజర్ పెట్టలేదని కూడా తెలియజేసింది నిహారిక. అలాగే విడాకుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డానని ఆ బాధ తనకు మాత్రమే తెలుసు అని ఎన్నోసార్లు తెలిపింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: