నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సోను సూదు ఒకరు. ఇదేనా తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం సోను సుద్ తెలుగులో విలన్ పాత్రలో నటించాడు. చాలా సంవత్సరాల క్రితం అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సోను సూద్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో సోను సూద్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది.
ఇకపోతే సోను సూద్ "అరుంధతి" సినిమా తర్వాత విలన్ గా నటించిన దూకుడు , కందిరీగ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ నటుడు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన బయట జీవితంలో మాత్రం ఎంతో గొప్ప వ్యక్తి. కరోనా సమయంలో చాలా మందికి సేవా కార్యక్రమాలను చేశాడు. అలాగే ఎంతో మంది పేదలకు అండగా నిలిచాడు. ఈయన చేసిన సేవా కార్యక్రమాలతో ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే సోను సూదు కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ప్రకారం సోను సూదు కు ఉన్న ఆస్తి వివరాల గురించి చూస్తే ... సోను సూద్ కి మొత్తం 150 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు సమాచారం.
ఇకపోతే 2021 వ సంవత్సరానికే సోను సూద్ దగ్గర 140 కోట్ల రూపాయల ఆస్తి ఉండగా , ఆయన గడిచిన ఈ మూడేళ్లలో కేవలం 10 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ మూడు సంవత్సరాలలో కూడా తన ఆస్తిని పెంచుకోవడం కంటే కూడా ప్రజలకు సేవ చేయడం పట్ల ఈయన ఎక్కువ దృష్టి పెట్టినట్లు అందువల్లే ఆయన ఆస్తి ఎక్కువగా పెరగనట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైనా సోను సూద్ సినిమాల్లో విలన్ గా నటించి క్రూరత్వాన్ని చూపించిన బయట జీవితంలో మాత్రం ఎంతో మంది ప్రేక్షకులకి ఎన్నో సేవలను చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.