పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు సీక్వల్ గా రాబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఓ జి హరిహర వీరమల్లు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఈ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో తనకి ఎప్పుడూ ఖాళీ సమయం దొరికితే అప్పుడే ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలున్న నేపథ్యంలో
పవన్ కల్యాణ్ పెండింగ్‌లో ఉన్న సినిమాల కోసం రెండు నెలలు సమయం ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మేకప్ వేసుకునేది నిజమే అయితే పవన్ కల్యాణ్ ఓ వైపు ప్రజా ప్రతినిధిగా, మరో వైపు యాక్టర్‌గా తన విధులను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తికంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లును ప్రస్తుతానికి పవన్ పట్టించుకునే ఉద్దేశంలో లేడని టాక్. ముందుగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి డేట్స్ ఇచ్చే
ఛాన్స్ ఉందని ఫిలింనగర్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడు సినిమాలలో ఈ సంవత్సరం విడుదలయ్యే చిత్రాలలో వీరమల్లు కూడా ఒకటి అని ఇప్పటికే.. అనౌన్స్ కూడా చేశారు. ఇటువంటి సమయంలో పవన్ ఈ సినిమాను ఇంకా హోల్డ్‌లో ఉంచడం గమనార్హం. అంతేకాదు పవన్ ఇలా ఆలస్యం చేస్తూ వస్తుండడంతో.. ఈ చిత్రం నిర్మాత ఎ.ఎం.రత్నంపై భారం ఎక్కువగా పడుతుంది. మరి ఇన్ని రోజులు పవన్ కోసం ఎదురుచూస్తున్న ఈ మూవీ టీం ఏం చేస్తారో చూడాలి. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణం.. ఏమిటి అన్న విషయంపై స్పష్టత లేదు...!!