వార్ 2 నుంచి ఎన్టీఆర్ లుక్ ఔట్.. అదిరిపోయిందిగా...?

Purushottham Vinay

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో 1300 కోట్ల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ సీన్స్ కి మాత్రం హాలీవుడ్ జనాలు ఫుల్ ఫిదా అయ్యారు. వారికి చాలా కొత్తగా అనిపించడంతో ఈ సినిమాకి గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. అలా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన ప్యాన్ వరల్డ్ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర 1 సినిమా షూటింగ్ తో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ అన్నట్టుగా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు తారక్. ఇక దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఇంకొక  రెండు మూడు రోజుల్లోనే విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ తో సాగే రొమాంటిక్ సాంగ్ అంటున్నారు ఈ పాటను. ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ని అందించాడు. 


ఇక వార్ 2 సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరూ కూడా ఇండియన్ స్పై ఏజెంట్స్ గా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. బాలీవుడ్ లో స్పై మూవీస్ కు చాలా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఆ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు..ఇక ఈ మూవీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందనే అంటున్నారు. లేటెస్ట్ గా వార్ 2 మూవీలో ఎన్టీఆర్ లుక్ ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ హల్చల్ చేస్తోంది. ఈ పిక్ చూడగానే చాలా ఫైరింగ్ గా ఉంది. చుట్టూ ఆయుధాలు, ఒక బ్లాక్ బోర్డ్, మినిమం ఫెసిలిటీస్ తో మాత్రమే ఉన్న ఒక చిన్న రూమ్ లో జూనియర్ ఎన్టీఆర్ తలదాచుకున్నట్టుగా కనిపిస్తోందీ ఫోటో. అయితే ఈ ఫోటోని ఫేక్ అంటున్నారు. కానీ లుక్ మాత్రం నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. మరి ఈ ఫోటో నిజమా కాదా అనేది మూవీ టీమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: