చిరు రిజెక్ట్ చేసిన స్టోరీ తో బాలయ్య బ్లాక్ బాస్టర్.. చిరు రిజెక్ట్ చేయడానికి అదే కారణం..?

frame చిరు రిజెక్ట్ చేసిన స్టోరీ తో బాలయ్య బ్లాక్ బాస్టర్.. చిరు రిజెక్ట్ చేయడానికి అదే కారణం..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల క్రితం కెరియర్ ను మొదలు పెట్టి తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో ఓ మూవీ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ కథ ఆ తర్వాత బాలకృష్ణ దగ్గరకు వెళ్ళింది. బాలకృష్ణ మాత్రం ఆ స్టోరీ ని ఓకే చేశాడు.

ఇక ఆ తర్వాత రూపొందిన ఆ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మరి చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీ తో బాలకృష్ణ ఏ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మంగమ్మ గారి మనవడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్ గా నటించగా ... కోడి రామకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే మొదట కోడి రామకృష్ణ ఈ సినిమా కథను చిరంజీవి కి వినిపించాడట.

ఆ కథ మొత్తం విన్న చిరంజీవి సున్నితంగా ఈ స్టోరీ నాకు సెట్ అవ్వదు సార్ వేరే వారితో చేయండి అని చెప్పాడట. దానితో కోడి రామకృష్ణ కూడా చేసేదేమీ లేక ఇదే కథను బాలకృష్ణకు వినిపించాడట. ఇక బాలకృష్ణకు మాత్రం ఈ స్టోరీ సూపర్ గా నచ్చిందట. వెంటనే ఈ సినిమా చేద్దాం సార్ అని చెప్పాడట. దానితో కోడి రామకృష్ణ , బాలకృష్ణ హీరోగా సుహాసిని హీరోయిన్ గా మంగమ్మ గారి మనవడు అనే టైటిల్ తో ఈ మూవీ ని రూపొందించడం , మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: