మాది విద్యావంతుల కుటుంబం.. అయినా నేను నటి కావడానికి కారణం అతనే.. శ్రీ లీలా..!

frame మాది విద్యావంతుల కుటుంబం.. అయినా నేను నటి కావడానికి కారణం అతనే.. శ్రీ లీలా..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న శ్రీ లీల తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంది. ఈ అవార్డు వేడుకలలో భాగంగా శ్రీ లీలను ఉద్దేశించి ఆమె తాతయ్య మాట్లాడారు. శ్రీ లీల తాతయ్య అవార్డుల కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ... నా పేరు నాగేశ్వరరావు , శ్రీ లీల తాతయ్యను. ప్రస్తుతం ఆమె విషయంలో చాలా గర్వంగా ఉన్నాను.  సినిమాల్లో రానిస్తూనే ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువును కూడా ఆమె కంప్లీట్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఆమె చదువు కూడా పూర్తి కానుంది.

ఇక నా కుమార్తె ఒక డాక్టర్. ఆమెను చూసి నా మనవరాలు కూడా డాక్టర్ కావాలి అనుకుంది. అందుకు సంతోషంగా ఎంతో ఉన్నా అని ఆయన ఈ అవార్డు ఫంక్షన్లో భాగంగా మాట్లాడారు. ఇక శ్రీ లీల మాట్లాడుతూ ... మా తాతయ్య వల్లే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న. నటిగా కెరియర్లో అద్భుతమైన స్థాయిలో రాణిస్తున్న. మాది విద్యావంతుల కుటుంబం. మా కుటుంబంలో ఎంతో మంది ఇంజనీర్లు , డాక్టర్లు ఉన్నారు. సినిమాల్లోకి వచ్చేందుకు తాతయ్య ప్రోత్సాహం అందించారు. ఆయన వల్లే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను అని ఈ బ్యూటీ తాజాగా అవార్డుల వేడుకల్లో భాగంగా చెప్పుకొచ్చింది.

ఇకపోతే శ్రీ లీలా ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం కూడా ఈనటి చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: