కొన్ని సందర్భాలలో కొంత మంది సెలబ్రిటీలు సినిమా ఫంక్షన్లలో అక్కడ ఉన్న హీరోను పొగిడేందుకు వేరే హీరోను తక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు అది ఉదేశ పూర్వకంగా చేయకపోయినా అందులో కొన్ని వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భం ఒకటి తెలుగు సినీ పరిశ్రమలో కూడా జరిగింది. అసలు విషయంలోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో బిల్లా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించింది. ఇకపోతే ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ నటలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈవెంట్ లో భాగంగా ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ... కొన్ని రోజుల క్రితం హిందీలో ధూమ్ 2 సినిమా చూశాను. అందులో హృతిక్ రోషన్ అద్భుతంగా ఉన్నాడు.
మన తెలుగులో ఇలాంటి హీరో ఎవరు ఉన్నారా అని అనుకున్నాను. ఇక బిల్లా సినిమా చూసిన తర్వాత హృతిక్ రోషన్ ఎందుకు పనికి రాడు అనిపించింది అని రాజమౌళి అన్నాడు. ఇక ఆ తర్వాత స్టేజి పైకి అల్లు అర్జున్ వచ్చాడు. ఇక అల్లు అర్జున్ కూడా బిల్లా సినిమాలో ప్రభాస్ ను చూసిన తర్వాత హృతిక్ రోషన్ కంటే ఎంతో బాగున్నాడు అని అనిపించింది అని ఆయన కూడా అన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ ప్రభాస్ ను పొగిడే క్రమంలో హృతిక్ రోషన్ ను తక్కువ చేశారు అని కొంత మంది అంటూ ఉంటే , మరి కొంత మంది మాత్రం వారు ఏ మాత్రం హృతిక్ రోషన్ ను తక్కువ చేయలేదు. వారు ఏదో కామన్ గా అలా అన్నారు. రాజమౌళి , అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎవరిని ఎప్పుడు తక్కువ చేయరు అనే వాదనను వినిపిస్తున్నారు.