ధనుష్ కుబేరలో నటించనున్న ఆ స్టార్ బ్యూటీ..?

frame ధనుష్ కుబేరలో నటించనున్న ఆ స్టార్ బ్యూటీ..?

murali krishna
కుమార్ వర్సెస్ కుమారి చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ సునైనా. అయితే ఈ మూవీ ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ఇటీవల యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీకి మంచి స్పందన రావడమే కాకుండా.. సునైనాకు గుర్తింపు తీసుకువచ్చింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సునైనా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.అదేమిటంటే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల పేరు తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఆయ‌న తీసిన‌వి కొన్ని చిత్రాలే అయినా ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయి ఉంటాయి. హ్యాపీడేస్‌, ఆనంద్‌, గోదావ‌రి, ఫిదా వంటి చిత్రాలే కాదు. మ‌రెన్నో సినిమాలు అందించారు. ఇప్ప‌డు తాజాగా మ‌రో చిత్రంతో శేఖ‌ర్ క‌మ్ముల ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. అదే కుబేర చిత్రం. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున కీల‌క‌మైన పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక‌, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక‌, ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీవల ముంబైలో కీలక షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్‌. ఇక‌, ఈ చిత్రం గురించి మ‌రో క్రేజ్ అప్‌డేట్ వ‌చ్చింది.కుబేర మూవీలో తాను కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సునయన స్వయంగా వెల్లడించిది. మరి ఈ వార్తల్లో ఇలాంటి నిజం ఉందొ తెలియదు కానీ అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే. సోషల్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ ఈడీ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది.ఇప్ప‌టికే కుబేర సినిమాకు సంబందించి ధనుష్, నాగార్జున లుక్స్‌‌‌‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఏక‌కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో షూట్ చేయ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: