ఆమె ప్లానింగ్ వేరే.. అక్కడే తేడా కొట్టింది.. అందుకే నాగార్జున లక్ష్మితో విడాకులు?

frame ఆమె ప్లానింగ్ వేరే.. అక్కడే తేడా కొట్టింది.. అందుకే నాగార్జున లక్ష్మితో విడాకులు?

praveen
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి అంచనాలను అందుకున్నాడు. ఏకంగా అక్కినేని అనే బ్యాగ్రౌండ్ నిలబెడుతూ స్టార్ హీరోగా కొనసాగాడు. దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున ఇక ఇప్పుడు 60 ప్లస్ వయసులో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు అని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కూడా రానిస్తూ ఉన్నాడు నాగార్జున.

 ఇక నాగార్జున అంటే బిగ్ బాస్ షో అన్నట్లుగా ఆయన ఒక స్పెషల్ బ్రాండ్ గా మారిపోయారు అని చెప్పాలి. ఇంకోవైపు ఇతర హీరోల సినిమాల్లోనూ కీలకపాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది   కాగా ప్రస్తుతం నాగార్జున.. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే నాగార్జున ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం గురించి కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు

 మొదట నిర్మాత మూవీ మొగల్ గా పేరు సంపాదించుకున్న దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు నాగార్జున. కానీ ఆ తర్వాత నాగచైతన్య పుట్టిన కొన్ని రోజులకే వీరు విడాకులు తీసుకుని పేరుపడ్డారు. ఆ తర్వాత అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక అమలా నాగార్జున టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. దగ్గుబాటి లక్ష్మికి అమెరికాలో ఉండడం అంటే ఇష్టమట  నాగార్జున షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఆమె యూఎస్ వెళ్లేవారు  ఇక చిత్ర పరిశ్రమతో సంబంధం మీతోనే అంతమైపోవాలని దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ తండ్రి రామానాయుడు కి ఓ సందర్భంలో తెలిపిందట. కానీ చివరికి హీరోనే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడే మంచి హిట్లు కొడుతున్న నాగార్జున ముందు యుఎస్ వెళ్లిపోదామని ప్రతిపాదన పెట్టిందట లక్ష్మి. నాగార్జున ఎందుకు ఇష్టపడలేదట దీంతో ఇదే విషయంపై విభేదాలు రాగా ఎవరికి ఇది భాగమే అటు విడాకుల వరకు వెళ్లిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: