భారీ రిస్క్ చేస్తున్న చరణ్.. తెలుగులో తొలి హీరో?

frame భారీ రిస్క్ చేస్తున్న చరణ్.. తెలుగులో తొలి హీరో?

praveen
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలపై ఇక ఎంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అలాంటిది స్వయంగా మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ పై అంతకుమించి అనే  రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి. చిరుత అనే సినిమాతో మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తన నటనతో తన యాక్షన్ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా టర్నింగ్ పాయింట్ తీసుకున్నాడు.

 ఇక తర్వాత తన నటనతో డాన్సులతో యాక్షన్ తో ఇక ప్రేక్షకులందరికీ కూడా మెప్పించి మెగా పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఇక ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అవతారం ఎత్తాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. వైవిధ్యమైన దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత ఈ మెగా హీరో లైన్ అప్ కూడా ఎంతో క్రేజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల గేమ్ చేంజ్  షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇక తన 16వ చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఈ మూవీ ఉండబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటన కూడా విడుదలైంది.

 అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఈ మూవీ తెరకెక్క పోతుంది అన్నది తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ రన్నర్ గా కనిపించబోతున్నాడు అంటూ ఎన్నో రోజుల నుంచి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఇక హీరో పాత్ర అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు అన్న నేపథ్యంలోనే ఈ మూవీ ఉండబోతుందట. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ గెటప్ కూడా ఎప్పుడు చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇక మరోసారి రంగస్థలం లాంటి గెటప్లో రామ్ చరణ్ ను చూడబోతున్నారట అభిమానులు. అయితే ఇలా రన్నర్ గా నటిస్తున్న తొలి తెలుగు హీరో చరణ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: