అందుకే నాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు.. ఒంటరి పోరాటం గురించి చెప్పేసిన నిహారిక..?

frame అందుకే నాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు.. ఒంటరి పోరాటం గురించి చెప్పేసిన నిహారిక..?

Pulgam Srinivas
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించింది. అలాగే కొన్ని సినిమాలను నిర్మించింది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సమయంలోనే ఈమె చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కొన్ని అనివార్య కారణాల వేళ్ళ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక నిహారిక ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే చైతన్యతో విడిపోయిన తర్వాత నిహారిక సినిమాల్లో నటించడం కంటే కూడా సినిమాలను నిర్మించడంలో అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమాను నిర్మించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. నీహారిక సినిమాను నిర్మించింది కాబట్టి మెగా హీరోలు అంతా ఈమెకు సపోర్ట్ చేసి ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలలో పాల్గొంటారు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే నిహారిక ఒంటరిగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. మెగా హీరోలు ఎవరు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడం లేదు.

తాజాగా మెగా హీరోలు ఎందుకు ఈ సినిమాకు ప్రమోట్ చేయడం లేదు అనే విషయం గురించి చెప్పుకొచ్చింది. మెగా హీరోలు ఈ సినిమాకు ప్రమోట్ చేయకపోవడం అంటూ ఏమీ లేదు. కాకపోతే వారు ఈ సినిమాకు ప్రమోషన్ చేయడానికి టైం కేటాయించే అంత ఖాళీగా లేరు. మా నాన్న నాగబాబు , బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక పెదనాన్న చిరంజీవి , అన్నయ్య చరణ్ ఇద్దరు ఒలంపిక్స్ గేమ్స్ చూడడానికి విదేశాలకి వెళ్లారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అందరూ బిజీగా ఉండడం వల్లే నా సినిమా ప్రమోషన్లలో వారు పాల్గొనడం లేదు అని నిహారిక తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: