డైరెక్ట్ తెలుగు మూవీలో నటించనున్న విజయ్ ఆంటోనీ.. దర్శకుడు ఎవరంటే..?

murali krishna
త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని న‌టించే సినిమాల‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ నెల‌కొంటుంది. ఇక ఈ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు చిత్ర యూనిట్.ఈ సినిమా విజ‌య్ మిల్ట‌న్ డైరెక్ట్ చేశారు. ఆగ‌స్టు 2న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండ‌టంతో, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి.ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎదురైన ప్రశ్నలపై స్పందించారు. సినిమా వాళ్లపై ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు? అని యాంకర్ అడగ్గా "వాటిని నేను పట్టించుకోను విని వదిలేస్తా" అని విజయ్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించగా "నేరుగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా ..ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.ఇంకా ఏ ప్రాజెక్టు ఖరారు కాలేదు"అని తెలిపారు. కమర్షియల్ హంగులతో దర్శకుడు విజయ్ మిల్టన్ తుఫాను చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాని ఈనెల రెండున విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా తెలుగు వర్షన్ను పోస్ట్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది తుఫాన్ తెలుగులో ఈ నెల 9న రిలీజ్ కానుంది.సినిమా విషయానికొస్తే..తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. "తుఫాన్" సినిమా నుంచి ఇప్పటికే ట్రయిలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ కలిసి ఈ సినిమాకు సంగీతం అందించారు.ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది."బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్‌తో, తెలుగు ఆడియెన్స్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. తుఫాన్ సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా" అని బిచ్చగాడుతో దగ్గరైన విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: