భారతీయుడు 2 ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali krishna
విశ్వనటుడు కమల్ హాసన్ రీసెంట్ సినిమా భారతీయుడు 2 జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య శంకర్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కమల్ హాసన్ నటన పరంగా మరోసారి ఇరగదీసినప్పటికీ కథనం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉందంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అలానే అనిరుధ్ సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాను వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.శంకర్ , కమల హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ గురించి.. ఇప్పటివరకు చాలానే డిస్కషన్స్ జరిగాయి. ఇక థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు మాత్రం ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. ఓటీటీ రూల్స్ ప్రకారం నెల రోజుల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలి.. కానీ ఆయా సినిమాల థియేట్రికల్ రన్, టాక్ ను బేస్ చేసుకుని.. వీలైనంత త్వరగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇండియన్ 2 మూవీ కూడా యాడ్ అవ్వబోతుంది. ఒక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఏ రకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందో.. అదే సినిమా సిక్వెల్ ప్లాప్ అయినా కూడా అంతే గుర్తుండిపోతుంది. అనుకోని కారణాల వలన ఇండియన్ 2 మూవీ విషయంలో అదే జరిగింది. 

దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఓటీటీ లో అయినా చూడాలని డిసైడ్ అయ్యారు.ఈ డేట్ విషయంలో కూడా చాలానే డిస్కషన్స్ జరిగిన తర్వాత.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇండియన్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. ఆగష్టు 9 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ నిర్మాతలకు సదురు ఓటీటీ సంస్థలకు తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు -2 వివాదం ముగిసిందని సమాచారం. ఇక మరోవైపు ఇండియన్ -2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే. దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం,థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ -2 ను ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: