డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటిస్తారా.. విజయ్ ఆంటోనీ రియాక్షన్ ఇదే?
మరి ముఖ్యంగా విజయ్ ఆంటోనీ కెరియర్ లో బిచ్చగాడు అనే సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇతన్ని ఏకంగా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ఏ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి సినిమాను చూసేశారు అని చెప్పాలి. ఇప్పటివరకు అటు కోలీవుడ్లో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసిన సినిమాలతో మాత్రమే విజయ్ ఆంటోనీ ఇక్కడి ప్రేక్షకులను అలరించాడు. కానీ డైరెక్ట్ గా ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు అని చెప్పాలి. దీంతో విజయ్ డైరెక్టుగా తెలుగు సినిమా చేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఇదే విషయం గురించి విజయ్ ఆంటోని స్పందించాడు. తనపై వచ్చే రూమర్స్ ను ఎప్పటికీ పట్టించుకోను అంటూ హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చాడు. అయితే తుఫాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడాడు విజయ్ ఆంటోని. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. టాలీవుడ్ మూవీలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కొన్ని కథలు చర్చలు జరుగుతున్నాయని.. కానీ ఇంకా ఏ మూవీ ఖరారు కాలేదు అంటూ తెలిపారు. కాగా విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన తుఫాన్ నేడు తమిళ వెర్షన్ విడుదల కాబోతుండగా.. ఈనెల తొమ్మిదవ తేదీన తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది అని చెప్పాలి.