వాయనాడ్‌ బాధితులను ఆదుకున్న రియల్‌ హీరోలు ?

frame వాయనాడ్‌ బాధితులను ఆదుకున్న రియల్‌ హీరోలు ?

Veldandi Saikiran
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కేరళ రాష్ట్రం గురించి ఏ మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా  కేరళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళ రాష్ట్రంలోని వయనాడు ప్రాంతంలో  పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 300కు పైగా జనాలు మరణించారు. మరణించిన వారిలో చిన్న పిల్లలు మహిళలు, కటిక పేదరికపు  జనాలు కూడా ఉన్నారు.  

ఇక ఈ ప్రమాదంలో దాదాపు 500 మందికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర బృందాలు అలాగే ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. మృతదేహాలను తీస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం  ప్రకటించాయి.

దేశంలోని ప్రముఖులు అలాగే సెలబ్రిటీలు కూడా ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వయనాడు బాధిత కుటుంబాలకు... తమిళ ఇండస్ట్రీ అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. వాయనాడు బాధితులను ఆదుకునేందుకు... 50 లక్షల రూపాయ లు సూర్య కుటుంబం ప్రకటించింది. ఇందులో కార్తీ అలాగే జ్యోతిక కూడా చేతులు కలపడం జరిగింది.

ఇక వీరు ఆర్థిక సహాయం ప్రకటించడంతో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా... కేరళ ముఖ్య మంత్రి సహాయ నిధి కి పది లక్షలు ఇ స్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ 20 లక్షలు ప్రకటించారు. మలయాళ నటుడు మమ్ముట్టి కూడా 25 లక్షలు అందించారు. ఇటు దుల్కర్ కూడా తన వంతుగా 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఫహద్ పజిల్, అతని భార్య నజ్రియా  25 లక్షలు ఇస్తా మని ప్రకటన చేశారు. ఇంకా మరి కొంతమంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: