ఆ విషయంలో తలైవాను ఫాలో అవుతున్న ప్రభాస్..?

frame ఆ విషయంలో తలైవాను ఫాలో అవుతున్న ప్రభాస్..?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మిగతా హీరోల కంటే ముందువరుసలో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు. రూ. 1100 కోట్ల వసూళ్లను సాధించి.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు డార్లింగ్. ఇక మార్కెట్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయం కూడా ప్రభాస్ కు పోటీ లేరనే చెప్పాలి. అంతలా ఇండియా వైడ్ గా తన స్టామినాను చూపిస్తున్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ సైతం తన సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపించే ప్రయత్నమే చేస్తున్నాడు. మూస కథల జోలికి అస్సలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్న రిస్క్ నే ఇప్పుడు ప్రభాస్ తీసుకున్నాడు.రజనీకాంత్ వంటి ఇండస్ట్రీ లెజెండ్‌లతో పోల్చదగిన విజయ స్థాయికి చేరుకోవడంలో ప్రాముఖ్యత ఉంది, ఇది అతని కెరీర్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది.సూపర్ స్టార్ రజినీకాంత్ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.బాలీవుడ్ బడా స్టార్స్ కూడా అంతటి క్రేజ్ లభించలేదు. రజిని తరువాత మళ్ళీ అంతటి క్రేజ్‌ని, ఫేమ్‌ని సంపాదించుకుంది రెబల్ స్టార్ ప్రభాస్. ఇక తనకి వచ్చిన ఈ ఫేమ్ ని నిలబెట్టుకోవడం కోసం ప్రభాస్.. రజినీకాంత్ ని ఫాలో అయ్యిపోతున్నట్లు అనిపిస్తుంది.

సేఫ్ జోన్ లో, ఒకే తరహా కథలను చేయాలన్న ఉద్దేశంలో డార్లింగ్ ప్రభాస్ లేరని స్పష్టంగా అర్ధం అవుతూనే ఉంది. ఈ విషయం అతడు ఎంచుకునే సినిమాలను బట్టే తెలుస్తోంది. సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, ది రాజా సాబ్ ఇలా వేటికవే ప్రత్యేకమైన చిత్రాలు. కథల పరంగా వేరియేషన్స్ చూపిస్తూ.. తనను తాను కొత్తగా ప్రేక్షకులను పరిచయం చేసుకుంటున్నాడు. ఇక అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్నే ఇప్పుడు ప్రభాస్ తీసుకున్నాడు. అవును.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు హార్రర్ ఫిల్మ్ చేసిన హీరోలు ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకరు రజినీకాంత్, మరోకరు ప్రభాస్.
ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే 2005లో చంద్రముఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ చిత్రం రజినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ తో మరోసారి ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు. ఈ మూవీ రొమాంటికి హార్రర్ కామెడీ అని మేకర్స్ ప్రకటించారు. డార్లింగ్ ఇప్పటి వరకు చేయని విభిన్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ సైతం ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలోనే ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నాడు. దాంతో మీ గట్స్ కి హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ప్రస్తుతం హార్రర్ కామెడీ అవుట్ డేటెడ్ అని అందరూ భావిస్తున్నారు. కానీ ఇలాంటి కథలతో హిట్ కొట్టడం డైరెక్టర్ మారుతికి వెన్నతో పెట్టిన విద్య. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోట్లేదు. ఇక అప్పుడు చంద్రముఖితో రజినీకాంత్ సూపర్ హిట్ కొడితే.. ఇప్పుడు రాజా సాబ్ తో ప్రభాస్ బంపర్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: