ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాను హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య న్యూస్ లైవ్‌లోనే చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వర్సెస్ శేఖర్ భాషా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ లావణ్య, శేఖర్
భాషా మధ్య డిబేట్ నిర్వహించింది. ఈ డిబెట్‌లో లావణ్య వర్సెస్ శేఖర్ భాషా వివాదం హద్దులు దాటింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ సమయంలోనే లావణ్యపై శేఖర్ భాషా సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్య చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని, బలవంతంగా వారు డ్రగ్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తోందని శేఖర్ భాషా ఆరోపించాడు. అలా చెబుతుండగానే కోపంతో శేఖర్ భాషాను తన కాలి చెప్పి తీసి కొట్టింది లావణ్య. దాంతో యాంకర్‌తోపాటు అక్కడున్న మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. లావణ్యను ఆపే ప్రయత్నం
చేశారు. నన్ను చెప్పుతో కొడతావా.. దా కొట్టు.. కొట్టు అంటూ లావణ్యపైకి ఆవేశంగా వెళ్లాడు శేఖర్ భాషా. అక్కడున్న వాళ్లు మాత్రం మ్యాన్ హ్యండ్లింగ్ వద్దంటూ ఇద్దరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో, నిజం ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంది. మొన్నటివరకు రాజ్ తరుణ్ ను వదిలేదు లేదని చెప్పిన లావణ్య గత రాత్రి అతను తనకు అవసరం లేదని ట్విస్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్, లావణ్య చాలా ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటామని లావణ్యకు రాజ్ తరుణ్ హామీ ఇచ్చాడు. అయితే తాజాగా, రాజ్ తరుణ్‌కి హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన నటి మాల్వీ మల్హోత్రాతో సంబంధం ఉందని లావణ్య ఆరోపిస్తుంది. మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేసింది. మాల్వీ మల్హోత్రా సోదరుడు, తల్లిదండ్రులు చంపేస్తానని బెదిరించిందని లావణ్య ఆరోపించింది. .!!