రాఘవేంద్ర రావుని గాఢంగా ప్రేమించిన హీరోయిన్.. ఎవరంటే.?
ఇక అప్పట్లో చాలామంది హీరోయిన్లకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే ఒక్క సినిమాలోనైనా నటించాలి అనే కోరిక ఉండేదట. ఎందుకంటే రాఘవేంద్రరావు సినిమాలో నటిస్తే కచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతారనే టాక్ అప్పట్లో ఉంది. హీరోయిన్ల అందాలను చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే అలాంటి డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే అప్పట్లో ఓ సీనియర్ హీరోయిన్ కి చాలా క్రష్ ఉండేదట. ఈ కారణంతో రాఘవేంద్ర రావు ఓ హీరోయిన్ చెల్లెలి అందాన్ని పొగుడుతూ ఉండడం ఆ హీరోయిన్ కి నచ్చలేదట.
ఇక అసలు విషయం ఏమిటంటే.. యాంగ్రీ మ్యాన్ గా టాలీవుడ్ లో పేరున్న రాజశేఖర్,జీవిత దంపతులు అందరికీ తెలుసు.అయితే జీవిత చెల్లెలు ఓసారి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఆమెను చూసిన రాఘవేంద్రరావు బాగుంది సినిమాలో ట్రై చేస్తే అవకాశాలు బాగా వస్తాయని చెప్పారట. అంతేకాకుండా జీవిత ఎప్పుడు డైరెక్టర్ తో తో ఉండడం రాఘవేంద్రరావుని ప్రేమించే ఆ హీరోయిన్ కి అస్సలు నచ్చలేదట. దాంతో ఆ హీరోయిన్ రాజశేఖర్ దగ్గరకి వెళ్లి రాఘవేంద్రరావు మీద తప్పుడు మాటలు చెప్పి మీ మరదల్ని ఆయన వాడుకోవాలని చూస్తున్నారని చెప్పిందట.
దాంతో ఫుల్ గా తాగి కోపంలో రాజశేఖర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి గొడవ చేసాడట. కానీ రాఘవేంద్రరావు తప్పు ఏమీ లేదు కావాలనే ఆ హీరోయిన్ అలా చెప్పిందని రాజశేఖర్, జీవితలు క్షమించమని అడిగినా కూడా రాఘవేంద్రరావు ఇప్పటికి మనసులో ఆ విషయాన్ని పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ రాఘవేంద్రరావు అంటే ఆ హీరోయిన్ కి చాలా ఇష్టం. అందుకే మా ఇద్దరికీ మధ్య గొడవలు పెట్టించాలని చూసింది అని చెప్పారు.