‘నేను శైలజ, రంగ్ దే, నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి’ వంటి
బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన క్యూట్‌నెస్‌తో కట్టిపడేసింది
హీరోయిన్ కీర్తి సురేష్. టలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు..బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.బాలీవుడ్‌లో మొదటి సినిమానే ఏకంగా స్టార్
హీరో వరుణ్
ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. ఇక టాలీవుడ్‌లో ఈ
బ్యూటీ అగ్ర హీరోల సరసన నటించి మంచి ఆదరణ పొందింది. మెగాస్టార్, సూపర్ స్టార్‌కు చెల్లెలిగా నటించి.. తెలుగు ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఈ
బ్యూటీ కలర్ ఫొటో
సినిమా నటుడు సుహాన్‌తో ఉప్పుకప్పురంబు చిత్రంలో నటిస్తుంది.ఇకపోతే
కీర్తి తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. నేచుల్ స్టార్
నాని అండ్ ఈ
బ్యూటీ నేను లోకల్,
దసరా సినిమాల్లో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో
నాని కొడుకు
అర్జున్ గురించి
కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కీర్తీ
సురేష్ బుగ్గలు కొరికేసిన స్టార్
హీరో కొడుకు..అదేంటి ఒక స్టార్
హీరోయిన్ బుగ్గల్ని
హీరో కొడుకు కొరికేయడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఏదేదో ఊహించుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ స్టార్
హీరోయిన్ ఎవరో కాదు
కీర్తి సురేష్. ఇక ఆ
హీరో ఇంకెవరో కాదు నాని.
నాని కొడుకు
అర్జున్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్
నాని అనేక సార్లు
అర్జున్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు.
అయితే
కీర్తి సురేష్,
నాని కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటి నుంచి వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.కీర్తి
సురేష్ మాట్లాడుతూ..
నాని కొడుకు జున్ను(
నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను
కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది.
జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది.
హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్ గా చెప్పాడు అని తెలిపి హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని
అర్జున్ చెప్పిన వాయిస్ క్లిప్ ని ఆ ఇంటర్వ్యూలో వినిపించింది. దీంతో
నాని ఫ్యామిలీకి
కీర్తి సురేష్ తో మంచి సాన్నిహిత్యం ఉందని మరోసారి అర్ధమవుతుంది. ఇక
నాని కొడుకు గురించి
కీర్తి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వాడు మిస్ యూ, సి యూ అనే పదాలు భలే క్యూట్ గా పలుకుతాడు. మూసీ, సూయు అంటాడు.తనకు ఎప్పుడైనా మనసు బాలేక, డల్లుగా ఉన్నపుడు జున్ను ఆడియోలు వింటే మళ్లీ యాక్టివ్ అవుతానని
కీర్తి చెప్పడం విశేషం. అంతే కాక జున్ను తనను అత్త అని పిలుస్తాడని.. తాను
నాని ఇంటికి ఎప్పుడు వెళ్లినా కొంచెం పెద్దవాడై కనిపిస్తాడని.. తన ఎదుగుదల చూస్తుంటే ఆనందం కలుగుతుందని
కీర్తి చెప్పింది.ఒక్క మాటలో చెప్పాలంటే
నాని ఫ్యామిలీ నా కుటుంబం అయిపోయింది. నేను
హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను. అంటూ
కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కీర్తి
సురేష్ మాత్రమే కాదు ఇప్పటివరకు
నాని తో నటించిన ప్రతి
హీరోయిన్ నానికి మంచి ఫ్రెండ్. సాయి పల్లవి, సమంత, నజ్రియా,
నిత్యా మీనన్ మృణాల్ ఠాకూర్ ఇప్పటికీ నానికి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు.
నాని కుటుంబంతో కూడా వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది.