తిరగబడరసామి రివ్యూ: రాజ్ తరుణ్ హిట్ కొట్టినట్టేనా..?

frame తిరగబడరసామి రివ్యూ: రాజ్ తరుణ్ హిట్ కొట్టినట్టేనా..?

Divya
ప్రేమ, పెళ్లి, అబార్షన్ అంటూ తాజాగా నిజ జీవితంలో తల మునకలవుతున్న రాజ్ తరుణ్ గతవారం పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అయితే ఈ శుక్రవారం తిరగబడరసామి అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం వివాదాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం అతడికి విజయాన్ని అందించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
నటీనటులు:
రాజ్ తరుణ్,  మాల్వీ మల్హోత్ర , రఘుబాబు, ప్రగతి , సత్తి, మన్నారా చోప్రా తదితరులు
దర్శకత్వం: రవికుమార్ చౌదరి
సినిమా కథ: గిరి (రాజ్ తరుణ్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. అనాధలా పెరిగి పెద్దవుతాడు. ఇక తనలాగా తన తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళందర్నీ వెతికి పట్టుకొని ఆ తల్లిదండ్రులకు అప్పగించడమే పనిగా పెట్టుకుంటాడు. అలా అతడి పేరు అందరికీ తెలిసిపోతుంది. ఒకసారి ఇంటర్వ్యూలో అతడిని చూసిన శైలజ ( మాల్వీ మల్హోత్రా) గిరికి దగ్గరవుతుంది. ఆ తర్వాత ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటారు. ఇంతలో కొండారెడ్డి ముఠా ఈమె కోసం వేట మొదలుపెడుతుంది. గిరి గురించి తెలుసుకొని శైలజాను అప్పగించాలని లేకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు.ఇక తన భార్య శైలజ రూ .2 వేల కోట్ల ఆస్తికి వారసురాలు అని తెలిశాక గిరి ఏం చేశాడు ఇంతకు కొండారెడ్డికి శైలజాకు మధ్య సంబంధం ఏమిటి ? తన భార్యను ఆస్తి కోసం కొండారెడ్డిగా అప్పగించాడా?  లేక భార్యను కోపాడుకోవడం కోసం కొండారెడ్డి తో పోరాడారా ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయానికి వస్తే తిరగబడరసామి కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. ప్రేక్షకుడి మనసును తాకే భాగోద్వేగాలు,  కాసేపు కాలక్షేపాన్ని ఇచ్చే హాస్యం ఏవి కూడా ఇందులో కనిపించలేదు. యువ జంట నటించిన సినిమా కదా..  సరదా సన్నివేశాలు, ప్రేమ నేపథ్యం ఏదైనా ఉంటుందేమో అని ఆశిస్తే మాత్రం నిరాశే . మొత్తం ఈ సినిమా సాదా సీదాగానే సాగింది . విరామం ఎపిసోడ్ కూడా ప్రేక్షకులు ఊహించిందే.  విరామం తర్వాత శైలజని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవడం కోసం హీరో ఏం చేశాడు అనే విషయాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తానికి అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపించింది దర్శకుడు కాలం చెల్లిన కథతో చేసిన ఈ ప్రయత్నం ఏ దశలో కూడా మెప్పించలేదు..మరి ఈ సినిమా ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి ఏ మేరకు విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: