హిట్ కొట్టిన ధనుష్ రాయన్.. కానీ తెలుగులో మాత్రం..!?

frame హిట్ కొట్టిన ధనుష్ రాయన్.. కానీ తెలుగులో మాత్రం..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా రాయన్. ఈ సినిమా జులై 27న విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ  యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్‌జే సూర్య, కాళీదాస్ జయరామ్, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ వంటి ప్రముఖులు నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా

 ప్రేక్షకుల ఆదరణతోపాటు ఓ అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ‘రాయన్‌’ ఈ గౌరవాన్ని పొందడం విశేషమనే చెప్పాలి.  ఇకపోతే రాయన్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రూ. 47.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినీష్ చేసిన రాయన్ మూవీ లాభాలు అర్జించింది. రాయన్ సినిమాకు 7వ రోజుతో
 రూ. 1.80 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో రాయన్ సినిమా హిట్‌గా నిలిచింది. కానీ, తెలుగులో మాత్రం రాయన్ సినిమాకు ఇంకా

 రూ. 28 లక్షలు వస్తేనే హిట్‌గా నిలుస్తుంది.  రాయన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో 5.50 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రాయన్ సినిమాకు రూ. 5.22 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 5.50 కోట్లు కావాలంటే ఇంకా 28 లక్షలు రావాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ కూడా 8వ రోజున అంటే ఆగస్ట్ 2న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వస్తున్నాయి. సినిమా రివేంజ్ డ్రామా అనే రొటీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ ధనుష్ టేకింగ్, యాక్టింగ్ అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాకు కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ రాయన్ మూవీ వారం రోజులు పూర్తి చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: