టాలీవుడ్ బ్యూటీ త్రిష క్రియాశీలంగా సినిమాల్లోనే కాకుండా, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మనల్ని అలరిస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ "బృందా" త్వరలోనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రాబోతోంది. సూర్య మనోజ్ వంగల రచన అలాగే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన సోనీ LIV లోకి అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇకపోతే "బృందా" వెబ్ సిరీస్ కథ చాలా ఆసక్తికరంగా
ఉంటుంది. ఈ సిరీస్‌లో త్రిష ఒక బలమైన స్త్రీ పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఎలాంటిది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ సిరీస్ తప్పక చూడాల్సిందే. అయితే త్రిష ఈ సిరీస్‌లో బృంద అనే పాత్రను పోషించింది. ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ అని త్రిష ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే కాకుండా ఈ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడ్డాను అని కూడా తెలిపారు. కాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మొత్తం 8 ఎపిసోడ్ లను కలిగి ఉంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా 40 నిమిషాలకి పైగా నిడివితో ఉంది. బృందాలో
హీరోయిన్ త్రిష సస్పెండ్ అయిన పోలీసు అధికారిగా నటించింది. ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆమని, ఆనంద్ సామి, రాకేందు మౌళి ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కొల్లా ఆశిష్ నిర్మించిన ఈ సిరీస్ కి శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించారు. కాగా త్రిష నటించిన ప్రతి సినిమా లాగే ఈ వెబ్ సిరీస్ కూడా అద్భుతంగా ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. త్రిష ఎల్లప్పుడూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. దానితో ఈ సిరీస్ పై అభిమానులు మరింత భారీ అంచనాలను పెట్టుకున్నారు.