అభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, తదుపరి తంగలాన్ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో లాంచ్‌కి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంచలన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాంగళం సినిమా యూనిట్ తాజాగా ఆడియో లాంచ్ డేట్‌ను ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 2 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక ఆడియో లాంఛ్ కి సంబందించిన అప్డేట్ ను కూడా వెల్లడించారు. ఈ ఘన కార్యక్రమాన్ని ఆగస్టు 5 వ తేదీన ఆడియో లాంచ్ ని జరుపుకుంటున్నారు. ఈ వేదికపై మూవీకి సంబంధించిన ఇతర వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్
సంగీతం అందించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ "తంగలాన్" సినిమాలో విక్రమ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇక విక్రమ్ తన ప్రతి సినిమాలోనూ కొత్తగా ప్రయత్నించడానికి ప్రసిద్ధి. "తంగలాన్" సినిమాలో కూడా అతను తన నటనతో అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాడు. సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.