సుభాష్ చంద్రబోస్ పాత్రలో డార్లింగ్.. క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్న డైరెక్టర్ ప్లాన్..!

frame సుభాష్ చంద్రబోస్ పాత్రలో డార్లింగ్.. క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్న డైరెక్టర్ ప్లాన్..!

lakhmi saranya
పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ మనందరికీ సుపరిచితమే . తాజాగా ప్రభాస్ హీరోగా వచ్చిన మూవీ కల్కి ‌. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు డార్లింగ్ ‌. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 1100 కోట్లు రాబట్టింది . ఇంకా కొన్నిచోట్ల ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది కూడా . ఇక ఇదిలా ఉంటే .. ఈ మూవీ అనంతరం ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు .

ఆయన నటిస్తున్న వరస పాన్ ఇండియా సినిమాల నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి . మన డార్లింగ్ చేతిలో ప్రెసెంట్ .. సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అండ్ ప్రశాంత్ నీల్ తో సలార్ టు .. నాగ్ అశ్విన్ తో కల్కి టు తో పాటు మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ ఉన్నాయి . ఇందులో నుంచి తాజాగా గ్లిమ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ‌. దీనికి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది కూడా . అయితే ఈ మూవీస్ తరువాత ప్రభాస్ హను రాఘవపూడి రాయబోతున్న ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది .

అంతేకాకుండా ఇందులో రెబల్ స్టార్ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి . కానీ దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు . కాగా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో డార్లింగ్ ఫాన్స్ చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు . ఈ వార్త కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగానే చెప్పుకోవచ్చు ‌. ఎన్ని సినిమాలు చేసిన ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఇంకా సినిమాలు ఆశిస్తూనే ఉంటారు కానీ సరి పెట్టుకోరు ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: