కమల్ అప్పుడు కూతురు కోసం ఆ పని చేశాడు.. మళ్లీ ఇప్పుడు ఆయన కోసం..??

frame కమల్ అప్పుడు కూతురు కోసం ఆ పని చేశాడు.. మళ్లీ ఇప్పుడు ఆయన కోసం..??

Suma Kallamadi

లోకనాయకుడు, కోలీవుడ్ స్టార్‌ కమల్‌ హాసన్ నటుడు మాత్రమే కాదు మంచి దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. కమల్‌ హాసన్ ఓ మంది రైటర్ కూడా, ఆ టాలెంట్ ఈ హీరో అప్పుడప్పుడు బయట పెడుతుంటాడు. 2024లో అతని గారాల పట్టి శృతి హాసన్‌ "ఇనిమెల్‌" పేరిట ఓ మ్యూజిక్‌ వీడియో చేసింది. దీనికి కమల్‌ హాసన్ లిరిక్స్ రాసి ఆశ్చర్యపరిచాడు. 

నేటి యువత ఆలోచనలు రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఆ మ్యూజిక్‌ వీడియో సాగుతుంది. దానికి తగ్గ లిరిక్స్ అందించి చాలామంది ప్రశంసలు అందుకున్నాడు కమల్‌ హాసన్. ఈ విషయం తెలిసిన ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఓ సంచలన నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే కమల్‌ హాసన్‌తో "థగ్‌ లైఫ్‌" సినిమాలోని ఒక పాటను రాయించాడట. ఆ పాట ఎలా ఉంటుంది అని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలయ్యింది. ఒక పెద్ద సినిమాలోని పాట రాయడం అంటే అంత సులభమేమీ కాదు. 

 ప్రొఫెషనల్ రైటర్స్ కూడా ఆ సందర్భానికి తగినట్లు పాట రాయడానికి చాలా సమయం తీసుకుంటారు. మరి కమల్ హాసన్ ఈ పాట లిరిక్స్ ఎలా రాయగలిగారు? బాగా వచ్చిందా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం "థగ్‌ లైఫ్‌" కోసం కమల్‌ రాసిన లిరిక్స్ కు తగినట్లు ఏఆర్‌ రెహమాన్ ఓ ట్యూన్ తో రికార్డ్‌ చేయడం కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఈ పాట సినిమా మొత్తానికే హైలెట్ అవుతుందని కూడా మూవీ మేకర్స్ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 తమిళ సినీ వర్గాల్లో ఈ పాట చాలా హాట్ టాపిక్ గా మారింది. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కమల్‌, మణిరత్నం కలిసి ఓ సినిమా చేస్తున్నారు కాబట్టి దీనిపై అంచనాలు భారీ లెవెల్ లో ఉన్నాయి. "థగ్ లైఫ్" పేరుతో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. 

కమల్ కు మణిరత్నం మరో విజయాన్ని అందిస్తాడని జనాలు నమ్ముతున్నారు. ‘విక్రమ్‌’ తర్వాత వరుస హిట్‌ల మీద గురిపెట్టిన కమల్‌కి ‘భారతీయుడు 2’తో ఎదురుదెబ్బ తగిలింది. "కల్కి" సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ అందులో కమల్ ది చిన్న పాత్ర మాత్రమే. అందుకే "థగ్ లైఫ్" హిట్ అవుతుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: