దేవర పోస్టర్.. వాళ్లకి పని మొదలైంది..!

frame దేవర పోస్టర్.. వాళ్లకి పని మొదలైంది..!

shami
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజైంది. దేవర సినిమా నుంచి సెకండ్ సాంగ్ అనౌన్స్ చేస్తూ ఈ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ లో తారక్ తో జాన్వి కపూర్ కూడా ఉంది. ఆగష్టు 5న సాంగ్ రిలీజ్ అని ప్రకటించారు. దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా లేట్ కి అనిరుద్ మ్యూజిక్ ఒక కారణమని తెలుస్తుంది.
ఇక ఇదిలాఉంటే కొన్నాళ్లుగా దేవర అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ పోస్టర్ సూపర్ కిక్ ఇచ్చింది. దేవర లో ఎన్టీఆర్ జాన్వి కపూర్ జోడీ అదరగొట్టబోతుందని తెలుస్తుంది. సినిమాలో తారక్ మరోసారి తన నట విశ్వరూపం చూడబోతున్నామని అర్ధమవుతుంది. ఐతే స్టార్ సినిమా పై ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు ఎంత ప్రమోషన్స్ చేస్తుంటారో అలానే యాంటీ ఫ్యాన్స్ మిగతా వాళ్లు కూడా ఎటాక్ చేస్తుంటారు.
ఈ క్రమంలో దేవర సినిమా మీద కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు ముందు ఆచార్య సినిమా చేశాడు. ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. అందుకే కొరటాల శివ ని ట్యాగ్ చేస్తూ ఇది మరో ఆచార్య కాకుండా చూస్తే బెటర్ అని అంటున్నారు. అంతేకాదు ఎన్ టీ ఆర్ లుక్ కూడా పెద్దగా తేడా లేదని అంటున్నారు. మరి ఈ కామెంట్స్ కి సినిమా తగిన సమాధానం చెబుతుందని చెప్పొచ్చు. స్టార్ సినిమా అప్డేట్ వస్తే చాలు యాంటీ ఫ్యాన్స్ అంతా అలర్ట్ అయ్యి సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తారు. ఐతే ఆ సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అయితే మాత్రం ఇలా రివర్స్ కామెంట్స్ చేసిన వాళ్లందరికి ఫ్యాన్స్ సమాధానం చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: