'దేవర' తెలుగు రైట్స్ ఆయనకే.. వామ్మో ఇంత భారీ బడ్జెట్ పెట్టాడేంటి?
కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్స్ షురూ చేస్తారు అనేది తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట కూడా రాబోతుందట. ఇక ఈ మేరకు ప్రకటన చేస్తూ ఒక కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఒక ఈ మూవీ లో ఎన్టీఆర్ జాన్వికాపూర్ ఎంతో రొమాంటిక్ ఫోజ్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది.
కాగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే దేవర మూవీకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ సొంతం చేసుకున్నారట. తన సితార డిస్ట్రిబ్యూషన్స్ ద్వారానే దేవరని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగు వర్షన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. అయితే ఎంతకు తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. 120 నుంచి 130 కోట్లకు ఇలా దేవర తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఓటిటి రైట్స్ 155 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. ఆడియో రైట్స్ 33 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్లకు అమ్ముడు పోయాయట.