ఇదే ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?

frame ఇదే ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది నిపుణులు. ఎవరైనా అమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా హవా నడిపించిందంటే దశాబ్ద కాలం పాటు అవకాశాలు తలుపు తడతాయని.. కానీ ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోవడంతో పెద్దగా అవకాశాలు రాక కనుమరుగవుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఎవరో చెప్పడం కాదు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరిగింది అని చెప్పాలి. అయితే ఇలా అవకాశాల విషయంలోనే కాదు అటు రెమ్యూనరేషన్  విషయంలో కూడా హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్లకు చాలా తక్కువ మొత్తంలో అందుతూ ఉంటుంది.

 హీరోల పారితోషికానికి హీరోయిన్ల పారితోషకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండడం కూడా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు తమ పారితోషకల గురించి ఎవరు పెద్దగా పైకి చెప్పేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది నటిమణులు ఇలా హీరో హీరోయిన్ల పారితోషకం వ్యత్యాసం పై స్పందిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల సీనియర్ హీరోయిన్ టబు సైతం ఈ విషయంపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న రెమ్యూనరేషన్లలో భారీ వ్యత్యాసాలపై టబూ స్పందించారు. ఔర్ మే కహా థమ్ అనే మూవీ ప్రమోషన్స్ లో పారితోషకం గురించి ఒక జర్నలిస్టు ప్రయత్నించగా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎందుకు నటీమణులనే అడుగుతారు.. నిర్మాతలను ప్రశ్నించవచ్చు కదా.. ఇలా మీకు ఎందుకు ఎక్కువ పారితోషకం ఇస్తున్నారు అని హీరోలను అడగొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. నాకు వచ్చే డబ్బుతో నేను సంతోషంగా ఉన్నానా లేనా అన్న విషయం కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు అంటూ టబు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: