దేవర నుంచి స్టన్నింగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న స్పెషల్ పోస్టర్..!

frame దేవర నుంచి స్టన్నింగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న స్పెషల్ పోస్టర్..!

murali krishna
తెలుగు సినీ చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం, స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నటనలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన తారక్.. ఆర్ఆర్ఆర్ మూవీతో స్టార్ గా పాన్ ఇండియా స్థాయిని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే.. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ “దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక” అంటూ తారక్ ఫ్యాన్స్ టాప్ లేపేస్తున్నారు. అయితే.. దేవర నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సింగిల్ సాంగ్, టీజ‌ర్ ల‌కు సాలిడ్ రెస్పాన్స్ ద‌క్కింది. అయితే, ఈ సినిమా నుండి మేక‌ర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్ సాంగ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్ ను ఆగ‌స్టు 15 రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వారు ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.
ఇది ఓ రొమాంటిక్ సాంగ్ గా ఉండ‌బోతుంద‌ని ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అందాల జాన్వీ క‌పూర్ న‌డుముపై ఎన్టీఆర్ చేయి వేసి ఆమె క‌ళ్ల‌లోకి చూస్తున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్ డిజైన్ చేశారు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. జన‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో ఈ సినిమా రానుండ‌టంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ ఫియర్‌ సాంగ్ విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.పోస్టర్ లో ఈ జంట చూడముచ్చటగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: