మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనలలో ఒకరు అయినటువంటి టబు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ తెలుగు మూవీలలో హీరోయిన్ గా నటించి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఈమె తన ఫుల్ ఇంట్రెస్ట్ ను హిందీ ఇండస్ట్రీ పై పెట్టింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం వరుస హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది.
కొంత కాలం క్రితమే టబు "క్రూ" అనే సినిమాలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఔర్ మే కహా దమ్ థా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర:పడిన నేపథ్యంలో టబు ఈ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా పాల్గొంటుంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఓ ప్రమోషన్లలో పాల్గొంది. అందులో ఈమెకు బాలీవుడ్ లో ఉన్న పారితోషకం వ్యత్యాసాలపై ప్రశ్న ఎదురయింది. దీనిపై ఈమె స్పందిస్తూ ... ఎందుకు పారితోషకం గురించి సంబంధించిన ప్రశ్నలు తరచూ నటీమణులనే అడుగుతుంటారు.
నిర్మాతలను కూడా ఇదే ప్రశ్న అడగవచ్చు కదా. అలాగే మీకెందుకు ఎక్కువ పారితోషకాలు ఇస్తున్నారు అని హీరోలను కూడా మీరు అడగవచ్చు కదా. అలా చేస్తే ఈ విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి అని టబు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పారితోషకల వ్యత్యాసాల గురించి స్పందించింది. ఇకపోతే తాజాగా టబు నటించిన ఔర్ మే కహా దమ్ థా సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన పలు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.