దేవి శ్రీ ప్రసాద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

frame దేవి శ్రీ ప్రసాద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరియర్ను మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఈయనకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , ఆయన కూడా వారి స్థాయి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో చాలా తక్కువ కాలంలోనే దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో బిజియేస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఇకపోతే ఈయన కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా అనేక ఇతర భాషా సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ చాలా సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగానే కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కూడా దేవి శ్రీ ప్రసాద్ అనేక తెలుగు సినిమాలు మరియు ఇతర భాష సినిమాలో కూడా ఉన్నాయి. ఈయన చాలా సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తూ ఉండడం , ఈయన సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకుంటూ ఉండటంతో ఈయన కెరియర్ లో చాలా ఆస్తులనే కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ దాదాపుగా 50 కోట్ల వరకు ఆస్తులను ఇప్పటి వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఒక్కో మూవీ.కి మూడు నుండి నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేతుల్లో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ ఒకటి. ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడం వల్ల ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dsp

సంబంధిత వార్తలు: