అల్లు అర్జున్, మంచు విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు క్రేజీ హీరో?

frame అల్లు అర్జున్, మంచు విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు క్రేజీ హీరో?

praveen
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుల హవా ఎంతలా నడుస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల చిన్నప్పటి క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకులను అల్లరించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇక ఇప్పుడు ఏకంగా హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను పలకరించి ఇక ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న వారి చిన్నప్పటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టును అసలు గుర్తుపట్టలేకపోతున్నారూ అభిమానులు. అతను ఎవరో అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మంచు విష్ణు పక్కన అమాయకంగా నిలబడి బుడ్డోడు ఇక ఇప్పుడు అందరిని తన నటనతో అలరిస్తున్న ఒక మంచి నటుడు. అల్లు అర్జున్ మంచు విష్ణు చేతుల మీదుగా ఏదో బహుమతి తీసుకుంటున్నట్లుగా ఈ ఫోటోలో కుర్రాడు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ కుర్రాడు ఇప్పటికే కొన్ని సినిమాల్లో వెబ్ సిరీస్ లలో సీరియస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు.  తెలుగు బుల్లితెరపై టాప్ హీరోల్లో ఒకడి lగా కొనసాగుతున్నాడు

 ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా.. ఆయన మరెవరో కాదు బుల్లితెర హీరో మానస్ నాగులపల్లి. ఈ పేరు ప్రేక్షకులందరికీ సుపరిచితం. ఎందుకంటే ఈయన ప్రస్తుతం బుల్లితెరపై టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. బ్రహ్మ ముడి మూవీలో హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే మొదటగా మానస్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. 2004 లో మహేష్ బాబు శ్రీయ జంటగా నటించిన అర్జున్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రవితేజ వీడే, బాలకృష్ణ నరసింహనాయుడు లాంటి సినిమాలను నటించాడు. ఇక వెండితెరపై 2017లో జలక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: