6 భాషల్లో రీమేక్ అయి.. హిట్ అయిన వెంకీ మూవీ ఏంటో తెలుసా..?
విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్న ఈయన అన్ని జానర్లను టచ్ చేసారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ , లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా చేశారు. కథ నచ్చితే హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాలు కూడా ఆయన చేయడం విశేషం. ఇక మంచి సినిమా ఏ భాషలో తెరకెక్కిన సరే దానిని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. అలా పదుల సంఖ్యలో రీమేక్ చేసే వెంకటేష్ తాను చేసిన స్ట్రైట్ సినిమా పవిత్ర బంధం. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయింది. 1996లో సౌందర్య, వెంకటేష్ జంటగా నటించిన ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో అన్ని జానర్ల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
భూపతి రాజా అందించిన ఈ సినిమా కథ ఎక్కువగా హీరోయిన్ సౌందర్య చుట్టూనే తిరుగుతుంది. కానీ వెంకటేష్ పవిత్ర బంధం సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. వెంకటేష్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. విదేశాల్లో చదువుకున్న హీరో విదేశీ సంస్కృతికి అలవాటు పడతాడు. తండ్రి బలవంతం తో తన ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. కొద్ది రోజులకు ఆమెను వదిలేస్తాడు. హీరోయిన్ మనసు ముక్కలవుతుంది. తిరిగి హీరో మనసు మారి హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఆమె బెట్టు చేస్తుంది. ఇలా సినిమాకి పోసాని రాసిన మాటలు హైలెట్, సౌందర్య నటన పీక్స్ అని చెప్పాలి. ఇంత అద్భుతమైన ఈ చిత్రం నుంచి సౌందర్యకు ఉత్తమ నటిగా, బాలసుబ్రమణ్యం కు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు లభించాయి. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, తమిళ్, హిందీ , బెంగాలీ, బంగ్లాదేశ్ భాషల్లో రీమేక్ చేశారు. ఇక అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.