"అర్జున్ రెడ్డి" కి ముందు సందీప్ రెడ్డి ఆ రెండు మూవీలకు పని చేసిన విషయం మీకు తెలుసా..?

frame "అర్జున్ రెడ్డి" కి ముందు సందీప్ రెడ్డి ఆ రెండు మూవీలకు పని చేసిన విషయం మీకు తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూ వీతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ఇదే కథను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ అనే పేరుతో సందీప్ రెడ్డి వంగా రీమిక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నాడు. ప్రభాస్ తో సందీప్ "స్పిరిట్" అనే టైటిల్ తో మూవీ ని రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" మూవీ కంటే ముందు ఓ రెండు సినిమాలకు పని చేశాడు. ఆ సినిమాలు ఏవి అనే విషయం తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ , నవదీప్ హీరో గా రూపొందిన మనసు మాట వినదు అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా రూపొందిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాకు కూడా అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు. క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక అనంతరం తన సొంత కథతో అర్జున్ రెడ్డి అనే మూవీకి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

srv

సంబంధిత వార్తలు: