అంజలి స్టేట్మెంట్ తో భయపడుతున్న రామ్ చరణ్ అభిమానులు..?

frame అంజలి స్టేట్మెంట్ తో భయపడుతున్న రామ్ చరణ్ అభిమానులు..?

Pulgam Srinivas
తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ మూవీల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది అంజలి. అంజలి కొన్ని సంవత్సరాల క్రితం జర్నీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో జర్నీ అనే పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే ఈ మూవీ లో అంజలి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి అంజలి కి తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది.

అందులో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత భారీ మల్టీస్టారర్ మూవీగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో ఈమె వెంకటేష్ కి జోడిగా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి. ఇప్పటికి కూడా ఈమె తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం గీతాంజలి మూవీకి కొనసాగింపుగా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది.

ఈ మూవీ విడుదల దగ్గర పడిన సందర్భంలో ఓ ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , గేమ్ చేంజర్ సినిమాలలో నటిస్తున్నాను. ఈ మూడు సినిమాల పేర్లు , నా పేరు "గ" అనే అక్షరం తోనే వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు అందుకుంటాయి అని చెప్పింది. ఇక చూస్తే గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో గేమ్ చేంజెర్ సినిమా కూడా ఆ కోవాలేక చేరుతుందా అని చరణ్ అభిమానులు కంగారుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: