తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను కలిగి ఉన్న నటీమణులలో భాగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు కూడా రాలేదు. ఆ తర్వాత ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కంచే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.
ఇక ఆ తర్వాత నుండి ఈమె పర్వాలేదు అనే స్థాయిలో ఆఫర్లను దక్కించుకుంటూ కెరియర్ ను మంచి స్థితిలోనే తెలుగు లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగు లో విపరీతంగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖేల్ ఖేల్ మె అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో విడుదల కానుంది.
ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన అక్షయ్ కుమార్ హీరో గా నటించాగా ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ దక్కి అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత హిందీ సినిమాలలో అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంది. మరి ఈ మూవీ తో ప్రగ్యా జైస్వాల్ ఎలాంటి విజయాన్ని అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ స్థాయి గుర్తింపును సంపాదించుకుంటుందో చూడాలి.