నేను ఎప్పుడూ అలాంటి పుకార్లు వినలేదు.. అలాంటి వార్తలపై స్పందించిన ప్రగ్యా జైస్వాల్..!

frame నేను ఎప్పుడూ అలాంటి పుకార్లు వినలేదు.. అలాంటి వార్తలపై స్పందించిన ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఖేల్ ఖేల్ మే అని హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల కోసం ఈ మూవీ మేకర్స్ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇకపోతే ఆ ఈవెంట్ కు ప్రగ్యా జైస్వాల్ కూడా విచ్చేసింది.

ఆ ఈవెంట్ లో భాగంగా ఈమెకు మీపై పుకార్లు వచ్చినప్పుడు అవి మీ కుటుంబంలో కలకలం సృష్టించాయా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ప్రగ్య స్పందిస్తూ... నేను ఇప్పుడు నా గురించి నెగటివ్ కామెంట్స్ వినలేదు. ఎవరు కూడా నా గురించి చెడుగా ప్రచారం చేసింది లేదు. నేనెప్పుడూ ప్రతికూల పుకార్లు వినలేదు. నా గురించి వచ్చినవే అన్ని మంచి పుకార్లే. అవి నిజంగా నిజమైతే చాలా బాగుండు అనే స్థాయి పుకార్లే నాపై పుట్టుకొచ్చాయి అని ప్రగ్యా జైస్వాల్ తాజాగా చెప్పుకొచ్చింది.

ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు , ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ కు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి. కొంతకాలం క్రితం ప్రగ్య , బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా మరికొన్ని రోజుల్లో అఖండ 2 మూవీ ని చ/తేకెక్కించబోతున్నారు. ఇందులో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: