రజినీకి అవమానం....అడ్వాన్స్ ఇవ్వకపోతే మేకప్ వేసుకోవా? వెళ్ళిపో అంటూ...?

frame రజినీకి అవమానం....అడ్వాన్స్ ఇవ్వకపోతే మేకప్ వేసుకోవా? వెళ్ళిపో అంటూ...?

Veldandi Saikiran

రజనీకాంత్ ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. తాజాగా రజనీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది ఆగస్టు 11వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎప్పటిలాగే రజనీకాంత్ తన స్టైల్, లుక్స్, డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను హైలైట్ చేశాయని చెప్పవచ్చు.  ఇక రజినీకాంత్ సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ సినిమాలో ఆఫర్ వచ్చిందట. కేవలం ఆ సినిమాలో హీరోగా చేసినందుకు రూ. 6000 రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నారట. షూటింగ్ మొదటి రోజు రజినీకాంత్ సెట్ లోకి వెళ్లారట.
హీరో వెళ్లిన వెంటనే మేకప్ చేయాలి కాబట్టి నిర్మాత మేకప్ చేసే వ్యక్తికి మేకప్ వేయమని చెప్పాడట. ఇక రజనీకాంత్ మేకప్ వేసుకోక ముందే నిర్మాతను ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వమని అడిగారట. దీంతో నిర్మాత కోపం వచ్చి అడ్వాన్స్ ఇస్తేనే మేకప్ వేసుకుంటావా.... అడ్వాన్స్ ఇస్తే కానీ మేకప్ వేసుకోలేనంత పెద్ద స్టార్ హీరోవా నువ్వు అని ఫైర్ అయ్యారట. ఈ సినిమాలో నీకు చాన్స్ ఇవ్వను వెళ్లిపో అని తీవ్రంగా ఆ నిర్మాత అవమానించారట.

దీంతో రజనీకాంత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బాధతో వెళ్లిపోయారట.  అప్పటి నుంచి పట్టుదలతో వచ్చిన ప్రతి పాత్ర చేస్తూ....నటుడిగా నిరూపించుకొని స్టార్ హీరో అయ్యారట రజనీకాంత్. కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా అవమానాలు తప్పలేదని.... వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు కాబట్టే అంత పెద్ద హీరో అయ్యాడని రజినీకాంత్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: