వయనాడ్ కోసం రంగంలోకి రియల్ హీరో?

frame వయనాడ్ కోసం రంగంలోకి రియల్ హీరో?

Veldandi Saikiran
వయనాడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈ విషాదం తెలిసి యావత్ భారతదేశం వనికిపోతుంది. కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో 270 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 200 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఇప్పటికి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విషాద ఘటనపై ప్రముఖులు స్పందిస్తున్నారు.

కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు లక్షల రూపాయలను విరాళంగా అందించి వారి వంతు సహాయం చేస్తున్నారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు.... తమిళ సినీ నటుడు సూర్య కుటుంబం బాధితుల కుటుంబాలకు వారి వంతుగా రూ. 50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా సూర్య భార్య జ్యోతికతో పాటు సూర్య సోదరుడు కార్తీ కూడా సహాయం చేశారు. ఇక సూర్య, జ్యోతిక, కార్తీలను ప్రజలు అభినందిస్తున్నారు.

ఈ విరాళం మొత్తాన్ని సూర్య కుటుంబం సీఎం సహాయ నిధికి అందించింది. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన స్థలంలో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటిస్తున్నారు. ఇండియన్ టెటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ వయనాడ్ లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. 2009లో అతనికి టెటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రధానం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మోహన్ లాల్ శనివారం రోజున మెప్పాడిలోని ఆర్మీ క్యాంపుకు వెళ్లారు.
అక్కడ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని.... ఇండియన్ ఆర్మీతో కలిసి కొండ చరియలు విరిగిపడిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ జరిగిన నష్టాన్ని, రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి వెళ్లారు. ఇక అటు కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి కుటుంబాలకు సినిమా తార లు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: