ఆశక్తిగా మారిన నిహారిక ఎత్తుగడ !!
ఈసినిమాలో అంత కొత్త నటీనటులు నటిస్తూ ఉండటంతో ఈసినిమా పై క్రేజ్ ఏర్పడటానికి నిహారిక అన్ని విషయాలలోనూ తానై వ్యవహరిస్తూ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈమూవీ గురించి అంచనాలు పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆగష్టు 9న విడుదల కాబోతున్న ఈమూవీలో 11 మంది కొత్త కుర్రాళ్ళు హీరోలుగా నటిస్తున్నారు.
సాయి కుమార్ శ్రీలక్ష్మీ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఈమూవీలో ఉన్నప్పటికీ ఈమూవీ పై ప్రస్తుతానికి ఎటువంటి క్రేజ్ సగటు ప్రేక్షకుడికి లేకపోవడంతో ఈమూవీ పై క్రేజ్ పెంచడానికి స్పెషల్ ప్రీమియర్లు వేయలాని నీహారిక ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆమె ఒక వినూత్న ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లో ఈసినిమా విడుదలకు ముందు రోజు స్పెషల్ షోలు వేసి ధియేటర్లకు పవన్ అభిమానులను బాగా రప్పించి పరోక్షంగా తన సినిమాను ప్రమోట్ చేయాలని నీహారిక ఆలోచన అని అంటున్నారు.
ఇలాంటి ఫ్రీ ప్రమోషన్ వల్ల ప్రమోషన్ ఖర్చు తక్కువ మాత్రమే కాకుండా ఈ ప్రీమియర్ షోలకు వచ్చే పవన్ అభిమానులకు కమిటీ కుర్రాళ్ళు సినిమా నచ్చి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే తన మూవీ హిట్ అవ్వడం చాల సులువు అన్న అంచనాలలో నిహారిక ఉన్నట్లు తెలుస్తోంది. నిహారిక చేస్తున్న ఈ మొదటి ప్రయత్నం విజయవంతం అయితే మెగా కాంపౌండ్ హీరోలు అనేకమంది ఉండటంతో వారిలో కొందరితో అయినా ఆమె సినిమాలు తీయగలిగితే ఆమె నిర్మాతగా మరింత రాణించే ఆస్కారం ఉంది..