దేవర vs పుష్ప 2 : సరికొత్త విషయంలో పోటీపడుతున్న ఆ రెండు పాన్ ఇండియా మూవీస్..!!

frame దేవర vs పుష్ప 2 : సరికొత్త విషయంలో పోటీపడుతున్న ఆ రెండు పాన్ ఇండియా మూవీస్..!!

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. నిజానికి పాన్ వరల్డ్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాయి. తెలుగు సినిమా ఈ స్థాయికి రావడంలో కృషి చేసిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఉంటారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ తన పేరును మారుమోగించాడు. తారక్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఈ హీరోల నుంచి సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు.ఈ నేపధ్యం లో స్టార్ హీరోల సినిమాలు బాక్సఆఫీస్ బరిలో పోటీపడటం కామన్.కానీ దేవర, పుష్ప 2సినిమాలు మాత్రం లీకుల పరంగా పోటీపడుతున్నాయి.ఒక రోజు ఈ సినిమా నుంచి వస్తే, ఇంకోరోజు ఆ సినిమా నుంచి లీకులు.ఈ నేపధ్యం లో లీకుల బెడ‌ద టాలీవుడ్‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా స్టార్ హీరోల‌ లుక్‌లు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండో లుక్ కూడా లీక్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు లుక్స్‌లో సందడి చేయనున్నారు.
ఆ రెండో లుక్ లేటెస్టుగా లీక్ అయ్యింది..అలాగే దేవర నుంచి జాన్వీ కపూర్ ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ జాన్వీ ల మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు.దీనికి సంబందించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో రిలీజ్ అయ్యాయి. ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప-2 ది రూల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లీక్ అయ్యింది. మరోసారి యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా లీక్ అయ్యింది.అభిమానుల్లో ఒకరు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. క్లిప్‌లో అల్లు అర్జున్, రష్మిక మరియు ఫహాద్ ఫాజిల్‌లు తాడుపై ఉన్న క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ చేయడం చూపిస్తుంది. ఇది సినిమాలో క్లైమాక్స్ సీన్ అని పలువురు అంటున్నారు. అభిమానులు ఈ లీక్స్‌తో సంతోషంగా లేరని.. ఇలాంటి లీక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని మేకర్స్‌ను కోరారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇలా దేవర, పుష్ప 2లీకుల విషయంలో పోటీపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: