“డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ లాంచ్..ఎప్పుడంటే..!

frame “డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ లాంచ్..ఎప్పుడంటే..!

Anilkumar
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా డబుల్ ఇస్మార్ట్.  కాగా గతం లో వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో చేపకర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా డబుల్ ఇష్మార్ట్ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్‌కు అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు చేస్తోంది. వైజాగ్ లో గురజాడ కళాక్షేత్రంలో

 ఆగస్టు 4 న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు తెలుగు సినీ ప్రముఖులు, మీడియాతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు. ట్రైలర్ లాంచ్‌ను మాస్ ఫీస్ట్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే నిర్మాత ఛార్మి మాస్ ఫ్యాన్స్ అందరూ రావచ్చు వచ్చి మాస్ ఫీస్ట్ చేసుకుందాం అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఆ ఈవెంట్ కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్యాన్స్ సహా ఇతర ఆడియెన్స్ కూడా వెళ్లిపోవచ్చని తెలుస్తుంది. ఇకపోతే ట్రైలర్‌లో రామ్

 పోతినేని యాక్షన్ సీన్లు, కామెడీ సన్నివేశాలు, సంజయ్ దత్ విలనిజం ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సమాచారం. అలాగే, చిత్రంలోని ఇతర కళాకారుల పాత్రలు కూడా ట్రైలర్‌లో కనిపించనున్నాయి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనుందని భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఇందులో రామ్  పోతినేని హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించనుంది. సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో నటించారు. అంతే కాకుండా ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: