తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం "VD12" కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంచనాలను మరింత పెంచేసింది. విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా "VD12" మూవీ నుంచి తన లుక్ ను విడుదల చేశాడు. ఈ లుక్ లో విజయ్ దేవరకొండ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయన
కొత్త హెయర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా షార్ట్ హెయిర్ కట్ మరియు గడ్డంతో ఉన్న విజయ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఒక్క లుక్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి. ఈ లుక్ కు సంబంధించిన పోస్ట్ కి లక్షల కొద్దీ లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా, ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. విజయ్ దేవరకొండ అగ్రెసివ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం
అందిస్తున్నాడు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా. కాగా ఈ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సోషల్ మీడియాలో “VD12” గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అభిమానులు ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని వారు భావిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.