రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు లావణ్య అలాగే రాజ్ తరుణ్ వివాదం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ కావాలని లావణ్య ఆందోళన చెందుతుంటే... తనకేం పట్టనట్టు రాజ్ తరుణ్ వ్యవహరిస్తున్నాడు. కానీ పోలీసులు, కేసులు అంటూ లావణ్య.. నాన రచ్చ చేస్తోంది. మీడియా రిపోర్టర్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ రాజ్ తరుణ్ కెరీర్ పై దెబ్బ కొడుతోంది. అయితే లావణ్య రచ్చ ఎక్కువ కావడంతో.. ఈ మధ్యకాలంలో శేఖర్ భాష లైన్ లోకి వచ్చాడు.
హీరో రాజ్ తరుణ్ తరఫున... పోరాటం చేస్తున్నాడు శేఖర్ భాష. లావణ్య ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెళ్లి మరి... ఆమె పరువు తీసేలా వ్యవహరిస్తున్నాడు శేఖర్ భాష. డ్రగ్స్ విపరీతంగా వాడుతోందని... ఇతరులకు కూడా లాభాన్ని అలవాటు చేసిందని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మేరకు ఆధారాలతో కూడా బయట పెడుతున్నాడు శేఖర్ భాష. ఈ తరుణంలో మొన్న జీ తెలుగులో కూర్చుంటే... శేఖర్ భాషాపై చెప్పు విసిరింది లావణ్య.
ఈ సంఘటన ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. అయితే ఇది కడుపులో దాచుకున్న శేఖర్ భాష... తాజాగా రివెంజ్ తీసుకున్నాడు. లావణ్య పై దాడి చేసి తానేంటో చూపించాడు శేఖర్ భాష. యూట్యూబ్ ఛానల్ లో మళ్లీ ఇద్దరూ అంటే లావణ్య మరియు శేఖర్ భాష కూర్చున్నారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ విషయం పైన యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇచ్చారు.
ఇక్కడే లావణ్య పై కోపం పెంచుకున్న శేఖర్ భాష... ఒక్కసారిగా దాడి చేశాడు. లావణ్య కడుపులో తన్ని... నాన రచ్చ చేశాడు శేఖర్ భాష. ఇక ఈ సంఘటన జరగగానే వెంటనే డయల్ 100 కు కాల్ చేసింది లావణ్య. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు గాయాల పాలు అయిన లావణ్య... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లావణ్య పై శేఖర్ భాష చేసిన దాడి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.