తెలుగులో అట్టర్ ప్లాప్.. అదే సినిమాను రీమేక్ చేసి హిట్టు కొట్టిన దళపతి విజయ్?

frame తెలుగులో అట్టర్ ప్లాప్.. అదే సినిమాను రీమేక్ చేసి హిట్టు కొట్టిన దళపతి విజయ్?

praveen
సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో హిట్ అవుతాయా అంటే మాత్రం కన్ఫార్మ్ గా చెప్పలేం. ఇది చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే రెండు భాషల ప్రేక్షకులకు రెండు రకాల అభిరుచులు ఉంటాయి. అందుకే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు.. మరో భాషలో ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు వరకు ఎన్నో సినిమాల విషయంలో ఇలా జరిగింది అని చెప్పాలి. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా కోలీవుడ్లో ప్లాప్ అయితే.. అదే తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇక సూర్య నటించిన 24 తెలుగులో భారీ వసూళ్లు సాధిస్తే తమిళ్లో మాత్రం ఫ్లాప్ అయింది. ఇలా తెలుగులో హిట్ అయిన సినిమాలు తమిళ్ లో ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 ఇక ఇలా తెలుగు హీరోలు చేసిన ఎంతోమంది సినిమాలను.. ఇక తమిళ హీరోలు ఎన్నోసార్లు రీమేక్ చేశారు. మరి ముఖ్యంగా అటు దళపతి విజయ్ ఒక్కడు, ఛత్రపతి,పోకిరి, అతనొక్కడే,  తమ్ముడు ఇలా ఎన్నో సినిమాలను తమిళ్లో రీమేక్ చేసాడు. ఇక అక్కడ సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే తెలుగులో అట్టర్ ప్లాప్ అయిన ఒక సినిమాను రీమేక్ చేసిన విజయ్ తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కొడుకు ప్రశాంత్ కోవెలపూడిని హీరోగా పరిచయం చేస్తూ నీతో అనే సినిమా తెరకెక్కింది.

 శ్రీకాంత్ తమ్ముడు అనిల్ ని కూడా ఈ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. ప్రేమించేది ఎందుకమ్మా సినిమా తీసిన రోజు జాన్ మహేంద్రన్ ఈ సినిమాకి డైరెక్టర్. అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.  కాగా తమిళ్లో ఇదే సినిమాలు సచిన్ పేరుతో రిమేక్ చేశాడు దళపతి విజయ్. ఇక అక్కడ కూడా డైరెక్టర్ జాన్ మహేంద్రన్ తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన నీతో సినిమా కొన్ని చిన్న మార్పులతో ఇక తమిళ్లో రీమేక్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఏకంగా 2005లోనే సెక్షన్ మూవీ 25 కోట్ల వసూళ్లు సాధించి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: