అఫీషియల్ : ఆ క్రేజీ సంస్థ చేతికి దేవర కర్ణాటక హక్కులు..!

frame అఫీషియల్ : ఆ క్రేజీ సంస్థ చేతికి దేవర కర్ణాటక హక్కులు..!

Pulgam Srinivas
అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని 1200 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.
 

జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ , బాబి డియోల్ విలన్ పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మివేసింది.

ఈ మూవీ యొక్క కర్ణాటక థియేటర్ హక్కులను కెవిఎన్ ప్రొడక్షన్స్ , షోవింగ్ బిజినెస్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క కర్ణాటక ధియేటర్ హక్కులను దక్కించుకున్నట్లు ఈ సంస్థలు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాయి. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి దేవర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: