బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మణులతో జాన్వి కపూర్ ఒకరు. ఈ బ్యూటీ మరికొంత కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమకు కూడా పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబోలో రూపొందబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా ఈమె హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా దానికి కూడా జాన్వి కూడా అటెండ్ అయ్యింది. ఇకపోతే మరో ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో మాత్రం జాన్వి వరసగా సినిమాల్లో నటిస్తున్న అవి ఆమెకు అపజాయలే అందుతు వస్తున్నాయి. తాజాగా ఈమె ఉలజ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆగస్టు 2 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ కి పబ్లిక్ నుండి మరియు విమర్శకుల నుండి కూడా నెగిటివ్ టాక్ వస్తుంది.
దానితో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్దగా రావడం లేదు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఆరోన్ మే కహా ధం తా మూవీ తో పోటి పడుతూ ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇక అజయ్ దేవ్ గన్ సినిమాతో పోటీ పడి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు కూడా దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈమె వరసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అవి ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.