తెలుగు అట్టర్ ఫ్లాప్ మూవీని రీమిక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ స్టార్ హీరో..!

frame తెలుగు అట్టర్ ఫ్లాప్ మూవీని రీమిక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ స్టార్ హీరో..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా ఒక భాషలో విడుదల సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి అంటే ఆ సినిమాలు వేరే భాషలో రీమిక్ చేయడానికి గతంలో మేకర్స్ చూస్తూ ఉండేవారు. దానితో కొంత మంది శుక్రవారం వచ్చింది అంటే చాలు ఏ భాషలో ఏ సినిమాలు విడుదల అయ్యాయి. అవి ఎలా ఉన్నాయి ..? వాటి టాక్ ఏమిటి ..? ఆ సినిమాలను తమ భాషలో రీమేక్ చేస్తే హీట్ అవుతాయా లేదా అని చూసిన సందర్భాలు కూడా అనేకం ఉండేవి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఓ టీ టీ ప్రభావం భారీగా పెరగడంతో రీమిక్ సినిమాలు తగ్గాయి.

ఎందుకు అంటే ఏదైనా మంచి సినిమా ఏ భాషలో వచ్చిన సరే దానిని ప్రేక్షకులు ఓ టీ టీ లోనే చూచేస్తున్నారు. దానితో రీమేక్ చేసిన అలాంటి మూవీలు హిట్ కావడం లేదు. దానితో ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇకపోతే దాదాపుగా ఎవరైనా హిట్ అందుకున్న సినిమాలనే రీమేక్ చేస్తూ ఉంటారు. ఫ్లాప్ అయినా సినిమాల జోలికి వెళ్లారు. కానీ తమిళ స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ తెలుగులో అట్టర్ ప్లాప్ అయిన ఒక మూవీ ని తమిళ్ లో రీమేక్ చేసి దానితో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు తెలుగులో అట్టర్ ప్లాప్ అయినా ఏ సినిమాను ఏ హీరో రీమేక్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలపూడిని హీరోగా పరిచయం చేస్తూ "నీతో" అనే మూవీ రూపొందింది. ఈ మూవీ కి జాన్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయిన ఈ సినిమాను తమిళ్ లో విజయ్ తో సచిన్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయినా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 2005 వ సంవత్సరం సచిన్ పేరుతో తమిళ్ లో విడుదల అయిన ఈ సినిమా మొత్తంగా 25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి విజయ్ కెరీయర్ లో ఆ టైమ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pv

సంబంధిత వార్తలు: